ధోనీ అనూహ్య నిర్ణయం.. సైన్యం కోసం విండీస్ టూరుకు దూరం

వరల్డ్ కప్ తర్వాత ధోనీ క్రికెట్‌కు గుడ్ బై చెబుతాడని వార్తలొచ్చాయి. కానీ మిస్టర్ కూల్ మాత్రం కామ్‌గానే ఉండిపోయాడు. ధోనీ ఇక చాలు తప్పుకోమని గంభీర్ లాంటి మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. భవిష్యత్ కోసం యువ క్రికెటర్లను సన్నద్ధం చేయడం కోసం మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకోవాలని మాజీలు సూచిస్తున్నారు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించకపోతే.. సెలెక్టర్లే అతణ్ని ఎంపిక చేసే అవకాశాలు లేవని వార్తలొస్తున్నాయి. సెలెక్టర్లు విండీస్ టూర్‌కు భారత జట్టును ఎంపిక చేయడానికి ఒక్క రోజు ముందు ధోనీ అందర్నీ ఆశ్చరపరిచే నిర్ణయం తీసుకున్నాడు.


కరేబియన్ పర్యటనకు తాను అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేసిన మహేంద్ర సింగ్ ధోనీ.. రిటైర్మెంట్ ప్రకటించడం లేదన్నాడు. రెండు నెలలపాటు ఆర్మీ రెజిమెంట్‌లో పని చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారొకరు వెల్లడించారు. పారాచూట్ రెజిమెంట్‌లో ధోనీ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా పని చేస్తోన్న సంగతి తెలిసిందే.

ధోనీ రిటైర్ కావడం లేదు, ఇంతకు ముందు ఇచ్చిన మాట ప్రకారం రెండు నెలలు సైన్యంతో కలిసి పని చేయబోతున్నాడు. మహీ నిర్ణయాన్ని కెప్టెన్ కోహ్లి సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు తెలియజేశామని బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపారు.

విండీస్ పర్యటన నుంచి ధోనీ తప్పుకోవడంతో అతడి స్థానంలో మూడు ఫార్మాట్లలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. లేదంటే టెస్టుల్లో సాహాకు అవకాశం ఇవ్వొచ్చు. ఆగష్టు 3న విండీస్‌తో భారత్ తొలి టీ20 ఆడనుంది. కరేబియన్ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు వన్డేల్లో టీమిండియా తలపడనుంది.

Source samayam.com

Kittu Siva

Read Previous

Maisie Williams aka Arya Stark ready to return to ‘Game of Thrones’ spin-off, but on one condition

Read Next

Gitanjali Rao’s Bombay Rose to open Venice International Film Critics’ Week

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *